ఈ గెలుపు ప్రజాపాలనకు నిదర్శనం
ఖమ్మం అర్బన్: సర్పంచ్‌లుగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం తమ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాపాలనకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండలం నుంచి గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పాలకవర్గాలను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సన్మానించి మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుండగా, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సర్పంచ్‌లు, పాలకవర్గాలు గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిజాయితీతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగళ్ల దీపక్‌చౌదరి, రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు యరగార్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురామ్, రావూరి సైదుబాబు, నాయకులు పువ్వాళ దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిషోర్, మురళి, చోటా బాబు, గుత్తా వెంకటేశ్వరావు, సండ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌ల సన్మాన సభలో మంత్రి తుమ్మల


