నారాయణపురం.. అందరి ఆమోదం
● మంత్రి పొంగులేటి స్వగ్రామం సర్పంచ్‌గా వెంకటేశ్వర్లు ● మంత్రి సోదరుడి సమన్వయంతో ఏకాభిప్రాయం
కల్లూరు రూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. ఈ స్థానం ఎస్సీ జనరల్ రిజర్వ్ కాగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ మద్దతు తెలిపిన గొల్లమందల వెంకటేశ్వర్లు పేరును ప్రతిపాదించారు. దీంతో చివరి రోజైన శుక్రవారం ఆయన మాత్రమే నామినేషన్ సమర్పించడంతో ఏకగ్రీవమైనట్లయింది. మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి చొరవ తీసుకుని గ్రామంలోని అన్నివర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిప్రాయ బేధాలను సర్దుబాటు చేయడంతో సర్పంచ్ సహా పది వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికై న వెంకటేశ్వర్లుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించగా.. ప్రసాద్‌రెడ్డి సన్మానించారు. నారా యణపురం అభివృద్ధికి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపురంలో ప్రభుత్వ ఆస్పత్రి, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో పాటు స్థానిక చెరువును టూరిజం శాఖ ద్వారా అభివృద్ద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.


