విశిష్టమైనది.. రాజ్యాంగం
ఖమ్మంలీగల్: ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం విశిష్టమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజల హక్కులు, బాధ్యతలతో పాటు ప్రభుత్వ అధికారాలు, పాలన వివరాలను రాజ్యాంగం తెలియజేస్తుందన్నారు. అన్ని మతాలు, భాషలు, జాతులు సమానంగా జీవించేలా రాజ్యాంగా మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.కల్పన, మురళీమోహన్, దీప, రజని, బిందుప్రియ, మాధవి, నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ బాధ్యులు విజయశాంత, గద్దల దిలీప్, ఇంద్ర నరసింహారావు, న్యాయవాదులు పాల్గొన్నారు
రాజ్యాంగం ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి
ఖమ్మంక్రైం: భారత రాజ్యాంగాన్ని ఔన్నత్యాన్ని అందరూ తెలుసుకోవాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ప్రవేశిక సామూహిక పఠనం చేపట్టారు. ఆతర్వాత ప్రతిజ్ఞ చేయగా అడిషనల్ డీసీపీ మాట్లాడారు. ఏఆర్ ఏసీపీలు సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


