నేడు, రేపు ‘ఫిలాటికల్’ ఎగ్జిబిషన్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని జిల్లా పంచా యతీ వనరుల కేంద్రం (డీపీఆర్‌సీ)లో గురు, శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యాన ‘ఖమ్మంపెక్స్’ పేరిట ఉమ్మడి జిల్లాస్థాయి ఫిలాటికల్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో స్టాంపుల సేకరణదారులకు పోటీలు నిర్వహిస్తారు. రెండు కేటగిరీలుగా నిర్వహించే పోటీ ల్లో పాల్గొనేందుకు పలువురు ఇప్పటికే చేరు కుని తాము సేకరించిన స్టాంపులను ప్రదర్శనకు పెట్టారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు రానుండగా, పాఠశాలల విద్యార్థులకు సైతం పోటీకి అవకాశం కల్పించారు. ఇదే సమయాన తపాలా శాఖ సేవలపై క్విజ్, లేఖారచన, స్టాంప్ డిజైన్ పోటీలను కూడా నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ మొదలవుతుందని, అరుదైన స్టాంప్‌లను ప్రదర్శించనుండడంతో పాఠశాలల విద్యార్థులు తిలకించేలా ఏర్పాట్లు చేశా మని డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. కాగా, బుధవారం సైతం పలు పాఠశాలల విద్యార్థులు స్టాంపుల ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
30న అథ్లెటిక్స్
క్రీడాకారుల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి అండర్–14, 16 బాలికల అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 30న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు మందుల వెంకటేశ్వర్లు, ఎండీ షఫిక్ అహ్మ ద్ తెలిపారు. పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఇక్కడ గెలిచిన వారిని అస్మిత లీగ్ అథ్లెటిక్స్ టోర్నీకి ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
108 అంబులెన్స్ తనిఖీ
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని 108 అంబులెన్స్‌ను జీవీకే ఈఎంఆర్‌ఐ గ్రీన్‌హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో పరికరాల పనితీరు, నిర్వహణ, అత్యవసర సమయాన వినియోగించే మందులను పరిశీలించడంతో పాటు ఆక్సీజన్ నిల్వలు, నెలవారి కేసులపై ఆరా తీశారు. కార్యక్రమంలో 108 జిల్లా మేనేజర్ ఎ.దుర్గాప్రసాద్, ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్, క్వాలిటీ బృందం బాధ్యులు కిశో ర్, ఫయాజ్ పాల్గొన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యాన అంబులెన్స్‌పై సీఎం చిత్రపటానికి స్టిక్కర్లు వేశారు.
ఆకతాయి చేష్టలతో రైతుకు నష్టం
కొణిజర్ల: కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ రైతు ఆరుగాలం శ్రమను బూడిదపాలు చేసింది. తనికెళ్ల ప్రధాన రహదారిపై పది రోజుల క్రితం సోప్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడగా, ఆయిల్ నేలపాలైంది. రోడ్డు పక్కన గొయ్యిలో అది నిండగా, అక్కడే స్థానికులు చెత్తాచెదారం వేశారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో చెత్తతో పాటు ఆయిల్ అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడికి సమీపానే అమ్మపాలెం రైతు కట్ల లాలయ్య మిర్చి సాగు చేయగా, కాతకు రావడంతో ఆదివారం కోత మొదలుపెట్టాలని భావించాడు. ఇంతలోనే మంటల కారణంగా ఎనిమిది గుంటల తోట కాలిపోవడంతో రూ.50 వేలకు పైగా నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
నేడు, రేపు ‘ఫిలాటికల్’ ఎగ్జిబిషన్
నేడు, రేపు ‘ఫిలాటికల్’ ఎగ్జిబిషన్


