లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలి
గరిష్టం / కనిష్టం
310 / 210
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. కొన్నిచోట్ల జల్లులు మొదలు ఓ మోస్తరు వర్షం కురవొచ్చు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
తిరుమలాయపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు రిజర్వాయర్‌లోకి 2026 ఖరీఫ్ సీజన్ నాటికి గోదావరి జలాలు తరలించేలా లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మండలంలోని బీరోలు, దమ్మాయిగూడెంలో సీతారామ ప్రాజెక్టు 16వ ప్యాకేజీలోని పాలేరు లింక్ కెనాల్, టన్నెల్ పనులను జల వనరుల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డీఈ బాణాల రమేష్‌రెడ్డితో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నాక ఆయన మాట్లాడుతూ ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని తెలిపారు. అంతేకాక భూసేకరణపై ఆరా తీసిన కలెక్టర్, టన్నెల్ తవ్వకానికి వినియోగిస్తున్న యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విల్సన్ ఇరిగేషన్, ఏఈలు రామకృష్ణ, రమాదేవి పాల్గొన్నారు.


