అందరూ చదవాలి! | - | Sakshi
Sakshi News home page

అందరూ చదవాలి!

Oct 23 2025 2:18 AM | Updated on Oct 23 2025 2:18 AM

అందరూ

అందరూ చదవాలి!

విద్యార్థులు ఆంగ్లంపై

పట్టు సాధించడమే లక్ష్యం

27నుంచి జిల్లాలోని

ప్రాథమిక పాఠశాలల్లో అమలు

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆలోచనతో శ్రీకారం

ప్రతీ విద్యార్థి ఇంగ్లిష్‌ చదవాలి..

●యాపిల్‌.. బాల్‌.. కార్‌.. డాల్‌

ఏమిటీ కార్యక్రమం..

జిల్లాలోని 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 – 5వ తరగతి వరకు విద్యార్థులకు ఇంగ్లిష్‌ చదివే సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌’ కార్యక్రమం అమలుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతీరోజు గంట పాటు ఇంగ్లిష్‌ రాయించడం, చదివిస్తూ ప్రతీ తరగతికి మెటీరియల్‌ సిద్ధం చేశారు. అంతేకాక యాప్‌ కూడా రూపొందించారు. ఈ యాప్‌లో ఉపాధ్యాయులు విద్యార్థుల పేర్లను నమోదు చేయాలి. ఇంగ్లిష్‌ అక్షరాలు రాయించడం, పలికించడం, ఆ తర్వాత పదాలు, చివరకు వాక్యాలు చదవడం, రాసే స్థాయికి తీసుకెళ్తారు.

29,393 మంది విద్యార్థులు

జిల్లాలో 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండగా, 29,393 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరినీ ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌ యాప్‌లో నమోదు చేస్తారు. ఈనెల 27నుంచి మెటీరియల్‌ అందించి ఇంగ్లిష్‌ అక్షరాలు రాయడం, చదివించడంతో మొదలుపెడతారు. వచ్చే నెల 30 నాటికి అంటే నెల రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఎలా పెరుగుతుందనే వివరాలను ప్రతీ బుధవారం యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

చింతకానిలో పైలట్‌ ప్రాజెక్టు

‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌’ కార్యక్రమ అమలుకు చింతకాని మండలంలోని 12 ప్రాథమిక పాఠశాలలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలోని పందిళ్లపల్లి, నామవరం, నాగులవంచ, రామకృష్ణాపురం, పాతర్లపాడు, ప్రొద్దుటూరు, కోమట్లగూడెం, చింతకాని, కొదుమూరు, అనంతసాగర్‌, బస్వాపురం, నేరడ పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థుల చొప్పున 650 మంది విద్యార్థులను యాప్‌లో నమోదు చేశారు. ఇప్పటికే ఇంగ్లిష్‌ అక్షరాలు పలికిండచంతో కార్యక్రమం మొదలైంది. 12 పాఠశాలల్లో ఈనెల 14న మొదలైన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 27వ తేదీ నుంచి ప్రారంభిస్తారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో

ఇంగ్లిష్‌ అభ్యసన సామర్థ్యం అంతంత

మాత్రంగానే ఉంటోంది. ప్రాథమిక స్థాయిలో పట్టు సాధించకపోవడంతో పై తరగతులకు వెళ్లేకొద్ది ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్‌

అనుదీప్‌ దురిశెట్టి జిల్లాలోని పలు ప్రభుత్వ

పాఠశాలలకు వెళ్లిన సందర్భంగా ఇంగ్లిష్‌లో చాలా మంది విద్యార్థులు వెనకబడి ఉన్నారని గ్రహించారు. ఈమేరకు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు తర్ఫీదు సాధించేలా ‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

814 ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌’

ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తే ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ ఉద్దేశంతోనే ఎవ్రీ చైల్డ్‌ రీడ్స్‌ కార్యక్రమం తీసుకున్నాం. చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్‌గా ప్రారంభించాం. ఆపై జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్నాం. ఇక్కడ విజయవంతం అయ్యాక అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అమలుచేస్తాం.

– అనుదీప్‌ దురిశెట్టి, కలెక్టర్‌

అందరూ చదవాలి!1
1/1

అందరూ చదవాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement