
ముత్తగూడెం చెక్‌పోస్టు తొలగింపు
సత్తుపల్లి: పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని రవాణా శాఖ చెక్‌పోస్టును బుధవారం అధికారులు తొలగించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పలుచోట్ల లెక్కాపత్రం లేని నగదు బయటపడింది. ఈమేరకు అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల తొలగింపునకు నిర్ణయించింది. ఇందులో భాగంగా డీటీఓ ఎం.వెంకటరమణ పర్యవేక్షణలో ముత్తగూడెంలోని చెక్‌పోస్టు నుంచి సామగ్రిని ఖమ్మం తరలించారు. అంతేకాక చెక్‌పోస్టును మూసివేసినట్లు చెబుతూ మూడు భాషల్లో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐ రాజశేఖర్‌రెడ్డి, ఉద్యోగులు బడేషా, సరిత, అశోక్ ఉన్నారు.
నేటితో ముగియనున్న
వైన్స్ టెండర్లు
ఖమ్మంక్రైం: జిల్లాలోని 116వైన్స్ దక్కించుకునేందుకు టెండర్లు దాఖలు చేసే గడువు గురువారంతో ముగి యనుంది. ఈమేరకు బుధవారం 50 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,177 దరఖాస్తులు రాగా, చివరిరోజు మరిన్ని వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
నిర్మాణాల్లో వేగం పెంచాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి ఆదేశించారు. పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో చర్చించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ లక్ష్మణ్‌గౌడ్, ఈఈ యల్లేష్, వరంగల్ జేడీ ఉప్పల శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్, వైస్‌చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.