
వరి కోతల్లో జాగ్రత్తలతో అధిక దిగుబడి
కూసుమంచి: వరి కోతల వేళ రైతులు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక దిగుబడి నమోదవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని పెరికసింగారంలో వరి కోతలనుబుధవారం ఆయన పరిశీలించి విత్తన రకాలు, పెట్టుబడి, దిగుబడులపై ఆరా తీశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ కోతల వేళ ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చూడడమేకాక, ఆరబోయడంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కూసుమంచిలోని పలు ఎరువుల దుకాణాల్లో నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. ఆతర్వాత కూసుమంచి ఏఓ కార్యాలయంలో వ్యవసాయ యాంత్రికీకరణకు అందిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఏఓ వాణి, ఏఈఓలు నవీన్, రవీందర్, వంశీకృష్ణ, సౌమ్య, ప్రియాంక పాల్గొన్నారు.
టీకాలతోనే
పశువులకు ఆరోగ్యం
ముదిగొండ: రైతులంతా తప్పనిసరిగా పశువుల కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, తద్వారా జీవాలు ఆరోగ్యంగా ఉంటా యని జిల్లా పశు వైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ముదిగొండ మండలంలోని పమ్మి, సువర్ణాపురం, నూలక్ష్మీపురంలో వ్యాక్సినేషన్ శిబిరాలను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పశువైద్య సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించాలని సూచించారు. లేదంటే సీజనల్‌గా వచ్చే వ్యాధులతో పశువులు నీరసించి వ్యవసాయ పనులకు సహకరించవని తెలిపారు. అనంతరం గ్రామాల్లో ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు అందచేసిన గేదెలను పరిశీలించి పోషణపై సూచనలు చేశారు. మండల పశువైద్యాధికారి అశోక్, ఇందిరా మహిళా డైరీ ఏపీఎంలు లక్ష్మణ్ రావు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఓసీల్లో నిబంధనల
అమలుపై ఆరా
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్, కిష్టారం సింగరేణి ఉపరితల గనులను పర్యావరణ, అటవీ శాఖల సభ్యులు ప్రొఫెసర్ ఆర్‌ఎం భట్టాచార్జీ, పర్యావరణ జనరల్ మేనేజర్ సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలు ఆరా తీశారు. అలాగే, బొగ్గు రవాణా సమయాన దుమ్ము లేకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకున్నారు. కాలుష్యాన్ని అరికడుతూ పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఏరియా జీఎం షాలేం రాజు, ఓసీ పీఓ ఎస్‌వీఆర్.ప్రహ్లాద్, ఉద్యోగులు కోటిరెడ్డి, రాజేశ్వరరావు, కల్యాణ్‌రామ్, రవికిరణ్, పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
లోటుపాట్లు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
కల్లూరురూరల్: ఎలాంటి సమస్యలు రాకుండా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ సూచించారు. కల్లూరు రైతు వేదికలో బుధవారం ఆయన తహసీల్దార్ పులి సాంబశివుడు, ఏఓ ఎం.రూప తదితరులతో సమావేశమయయ్యారు. కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, కాంటాలు సమకూర్చుకోవాలని, ధాన్యం బస్తాలకు ట్యాగ్ వేశాకే మిల్లులకు పంపించాలని తెలిపారు. అంతేకాక రైతుల పూర్తి వివరాలను పోర్టర్‌లో నమోదు చేస్తే వారికి త్వరగా నగదు జమ అవుతుందని చెప్పారు. అనంతరం ఎర్రబోయినపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీసీఎస్‌ఓ తేమ శాతాన్ని పరీక్షించారు.

వరి కోతల్లో జాగ్రత్తలతో అధిక దిగుబడి

వరి కోతల్లో జాగ్రత్తలతో అధిక దిగుబడి

వరి కోతల్లో జాగ్రత్తలతో అధిక దిగుబడి