పంచమి మంచిదని..
ఖమ్మంక్రైం: పంచమి తిథి మంచిదని భావించి, రెండో శనివారం సెలవును సైతం రద్దు చేసుకొని ఎకై ్సజ్‌శాఖ నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు టెండర్ల కార్యక్రమం కొనసాగించింది. పంచమి మంచిదని వ్యాపారులు భారీగానే దరఖాస్తులు సమర్పించారు. శనివారం ఒక్కరోజే 116 మద్యం దుకాణాలకు గాను 86 దరఖాస్తులు వచ్చా యి. దీంతో ఇప్పటివరకు 158 దరఖాస్తులకు గాను రూ.4.74 కోట్ల ఆదాయం జిల్లా ఎకై ్సజ్ శాఖకు వచ్చింది. సోమవారం నుంచి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంపై కేసు
ముదిగొండ: మండలంలోని బాణాపురం – పెద్దమండవ ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి జరి గిన రోడ్డు ప్రమాదంపై శనివారం ముదిగొండ సీఐ మురళి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్‌ల కథనం ప్రకారం.. పెద్దమండవకు చెందిన గొర్రెముచ్చు యోహాన్ కుమారు డు సాయి ద్విచక్రవాహనపై తన చెల్లెలు సన(9), స్నే హితుడు పేరం ప్రవీణ్ (13)ను ఎక్కించుకుని ఖమ్మం వెళ్తున్నాడు. మార్గమధ్యలో బాణాపురం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా ట్రాక్టర్ వచ్చింది. ఆ లైటింగ్‌కు ద్విచక్రవాహనం అదుపుతప్పి కట్టెలపై పడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. గొర్రె ముచ్చు సన, సాయి లను ఖమ్మం తరలిస్తుండగా సన మృతిచెందింది. సాయి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా డు. సాయి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రవీణ్ తండ్రి బుజ్జిబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ముదిగొండ సీఐ మురళి కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


