
అంతరాయం లేని విద్యుత్ సరఫరా
బోనకల్: అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. మధిర 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి బోనక ల్ సబ్‌స్టేషన్‌కు సరఫరా అవుతున్న 33 కేవీ లైన్లకు ప్రత్యామ్నాయంగా పెద్దగోపతి సబ్‌స్టేషన్ నుంచి రావినూతల వరకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేయగా బ్రేకర్లను ఆదివారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిర 133 కేవీ సబ్ స్టేషన్ నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ లైన్లలో ఏదైనా అంతరాయం ఏర్పడితే పెద్దగోపతి 133 కేవీ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేసేందుకు వీలుగా రూ.70లక్షల వ్యయంతో లైన్ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. రావినూతల విద్యుత్ కేంద్రం నుంచి జానకీపు రం, మోటమర్రి, సిరిపురం ఉపకేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైరా డీఈ బండి శ్రీనివాసరా వు, సబ్ డివిజన్ ఏడీఈ పి.కిరణ్‌కుమార్, ఏఈటీ మనోహర్, బోనకల్ ఏఈ సాయికుమార్ పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసాచారి వెల్లడి