
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో తనిఖీ
ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసిన
అదనపు కలెక్టర్
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈనెల 26లోగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో తనిఖీకి వివిధ శాఖల అధికారులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవన ప్లాన్, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్, ట్రేడ్ లైసెన్స్, ఇతర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్ రెడ్డి, సీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.