
సామాన్యులకు కమ్యూనిస్టులే అండ..
కొణిజర్ల: నాటి నిజాం పాలన, నేటి బూర్జువా పార్టీల పాలనలో సామాన్యులకు అండగా నిలిచి పోరాటాలు చేస్తున్నది కమ్యూనిస్టులే అని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని తనికెళ్లలో గడల సీతారామయ్య, కొణిజర్లలో దొండపాటి వెంకయ్య స్మారక స్తూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రను ఎవరూ వక్రీకరించలేరని, రజాకార్లకు ఎదురొడ్డి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వం నాటి నిజాం పాలకులను గుర్తు చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలో కొనసాగాలని చూస్తోందని ఆరోపించారు. అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు యర్రా బాబు, దొండపాటి రమేశ్, పోటు కళావతి, మండల కార్యదర్శి గడల భాస్కరరావు, సహాయ కార్యదర్శులు స్వర్ణ రమేశ్, మణిగె కోటేశ్వరరావు, నాయకులు గడల సీతారామయ్య, తోటపల్లి సీతారాములు, సోమయ్య, గోపాల్‌రావు, విష్ణుమూర్తి, రామయ్య, రాంబాబు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.