
ఫుడ్ పాయిజన్ అంటూ ప్రచారం
కూసుమంచి: మండలంలోని మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పాయిజన్ అయిదంటూ సోషల్ మీడియాలో ప్రచారం కాగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రచారంతో ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్‌రావు, ఎంఈఓ బీవీ రామాచారి హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో వండిన ఆకుకూర పప్పు రుచిలో తేడా ఉండటం, సాంబారు పుల్లగా ఉండటంతో పలువురు స్థానిక విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు. కాగా, భోజనం రుచిగా లేకపోవటంతో కొందరు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లి భోజనం చేశారని, అంతేగానీ విద్యార్థులు ఎవరూ అస్వస్థతకు గురికాలేదని ఆర్డీఓ తెలిపారు.
కోలాహలంగా
‘కేటీపీఎస్’ ఎన్నికలు
పాల్వంచ/మణుగూరురూరల్: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలు బుధవారం కోలాహంగా జరిగాయి. కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 2,100 మంది సభ్యులకు 1,728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణుగూరులోని బీటీపీఎస్ ఎస్‌పీఎఫ్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో 500 మంది ఉద్యోగస్తులకు గాను 450మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వైటీపీఎస్‌లో 396 మంది ఓటర్లకుగాను 367 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్ల ను ఆకర్షించేలా ఫ్లకార్డులు, కరపత్రాలు, గుర్తులను సూచిస్తూ అభ్యర్థులు సందడి చేశారు. పోటీలో ఉన్న 37 మంది డైరెక్టర్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రా ల వద్ద ఉద్యోగులను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సొసైటీలో మొత్తం 2,996 మంది ఓటర్లు ఉండగా, 2,545మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. మొత్తం84.94శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
గుప్త నిధుల కోసం అన్వేషణ!
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో కొందరు గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు పగటి వేళల్లో లాడ్జిల్లో బస చేస్తూ, అర్ధరాత్రి వేళలో తవ్వకాలను జరిపే ప్రాంతాలను అన్వేషించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరి తో పాటు గుప్తనిధుల ముఠాఓ కమాండర్ జీప్‌లో సంచరిస్తున్నట్లు సమాచా రం. మండలంలో పలు గ్రామాల్లో జీప్ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అశ్వారావుపేట ఎస్ ఐ యయాతి రాజు దృష్టికి తీసుకువెళ్లగా.. రాత్రిళ్లు తిరిగే వాహనాలు, వ్యక్తులపై నిఘాపెడతామన్నారు. గుప్తనిధు లు వంటి ప్రచారాలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
కొనసాగుతున్న
ఆర్టీసీ డ్రైవర్ల నిరసన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్లు చేపట్టిన నిరసన మూడో రోజు బుధవారం కూడా కొనసాగింది. 42 మంది టిమ్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు 10 సర్వీసులను తగ్గించారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు యూని యన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి, టిమ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డీఎం తిరుపతిని కోరారు. లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పారు. భద్రాచలానికి డిపోనకు చెందిన టిమ్ డ్రైవర్ నాగరాజు పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తోటి డ్రైవర్లు తెలిపారు. కాగా భద్రాచలం డిపోలో సేప్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఎస్‌డీఐ)గా విధులు నిర్వహిస్తున్న పోకల సురేష్ తన పోస్టుకు మంగళవారం రాత్రి రాజీనామా చేశారు.

ఫుడ్ పాయిజన్ అంటూ ప్రచారం