
ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీ విద్యార్థులు 2025–26 ఏడాదికి గాను పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బి.పురంధర్ సూచించారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఉందని తెలిపారు. అలాగే, 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను కళాశాల యాజమాన్యాలు ఈనెల 31లోగా అందజేయాలని ఆయన ఆదేశించారు.
సహచరుల కుటుంబాలకు ఎకై ్సజ్ ఉద్యోగుల చేయూత
ఖమ్మంక్రైం: ఎకై ్సజ్‌శాఖలో హెడ్ కానిస్టేబుళ్లు లింగా, చంద్రు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలకు ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు అండగా నిలిచారు. ఈమేరకు ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని వారి కుటుంబాలకు అందజేశారు. ఇందులో భాగంగా లింగా, చంద్రు కుటుంబాలకు రూ.5.32లక్షలను గురువారం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా ఖమ్మంలో అందజేశారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, ఏఈఎస్‌లు తిరుపతి, వేణుగోపాల్‌రెడ్డితో పాటు సీఐలు, ఎస్‌ఐలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో
భూభారతి దరఖాస్తులు
కొణిజర్ల: భూభారతి గ్రామసభల్లో అందిన అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కొణిజర్ల తహసీల్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన దరకాస్తుల వివరాలు ఆరా తీశారు. ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయడమే కాక నిబంధనల మేరకు పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, దరఖాస్తుదారులకు భూభారతి ఆన్‌లైన్ పోర్టల్‌లో నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు. తహసీల్దార్ నారపోగు అరుణ, డిప్యూటీ తహసీల్దార్ రాముతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
మధిర ట్యాంక్‌బండ్
అభివృద్ధికి రూ.6.02 కోట్లు
మధిర: మధిరలోని పెద్ద చెరువును ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గురువారం రూ.6.02 కోట్ల నిధులను మంజూరు చేసింది. ట్యాంక్ బండ్ వద్ద పర్యాటకులకు సదుపాయాల కల్పనలో భాగంగా కాటేజీలు, రెస్టారెంట్, విశ్రాంతి గదులు నిర్మించనుండగా, పిల్లలకు ఆటపరికరాలు ఏర్పాటుచేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో ఈ నిధులు మంజూరు కాగా, పనులు పూర్తయితే ట్యాంక్ బండ్ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది.
‘పీఎం–జన్‌మన్’
పురోగతి ఎలా ఉంది?
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయమహా అభియాన్ (పీఎం–జన్‌మన్) పథకం ద్వారా ఏయే పనులు చేపట్టారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి గురువారం లోక్‌సభలో ప్రశ్నించారు. అలాగే, దుర్భల గిరిజన సమూహా(పీవీటీజీ)ల పురోగతిపై ఆయన ఆరా తీశారు. ఈ అంశాలపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వెనకబడిన గిరిజన నివాస ప్రాంతాల్లో పక్కా ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, వైద్యశిబిరాల నిర్వహణ, మొబైల్ టవర్ల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రూ.24 వేల కోట్లు కేటాయించగా.. ప్రాధాన్యతాక్రమంలో రాష్ట్రాల వారీగా పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణలో 3,884 పనులు చేపట్టగా 41 శివారు గూడెంల్లో ఆదివాసీలకు మేలు జరుగుతోందని మంత్రి తెలిపారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఉపకార వేతనాలకు దరఖాస్తులు