
బైక్‌ను ఢీకొట్టిన లారీ
ఖమ్మంరూరల్: మండలంలోని చింతపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయ పాలెం మండలం చంద్రుతండాకు చెందిన బానోత్ వీరకుమార్ (26)వంట మాస్టర్‌గా, ర్యాపిడో బైక్ ట్యాక్సీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న ఉద యం ఇంటి నుంచి ఖమ్మం వెళ్లి పని ముగించుకుని తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో చింతపల్లి వద్ద వరంగల్ వైపు నుంచి ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు బృందం సాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య అంజలి ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు..
ఎర్రుపాలెం: మండలంలోని పెగళ్లపాడు ఆర్వోబీపై కారు బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో చర్చి ఫాదర్ దుర్మరణం పాలైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మీనవోలు గ్రామానికి చెందిన నండ్రు వెంకటేశ్వరరావు (50) అలియాస్ జ్ఞానప్రకాష్ మధిర పట్టణంలోని సెవెంత్ డే చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పెగళ్లపా డు గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా పెగళ్లపాడు ఆర్వోబీపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి కారుడ్రైవర్, పెద్దగోపవరం గ్రామానికి చెందిన శీలం శివరామకృష్ణారెడ్డి పరారయ్యాడు. మధిర రూరల్ సీఐ మధు, ఎస్‌ఐ రమేశ్ చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, బాబు ఉన్నారు. మృతుడి సోదరుడు దావీదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
యువకుడు మృతి
చర్చి ఫాదర్ దుర్మరణం

బైక్‌ను ఢీకొట్టిన లారీ