
విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యం
● 15 నాటికి యూనిఫామ్, పుస్తకాల పంపిణీ పూర్తి ● విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రతీ విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ పని తీరు ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి విద్యాశాఖపై ఆయన సమీ క్షించారు. ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నందున సదుపాయాల కల్పన, ఫలితాల సాధనలో పురోగతి కనిపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈనెల 15నాటి కి రెండేసి జతల యూనిఫామ్, పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. తనిఖీ సమయాన ఎక్కడైనా విద్యార్థులు యూనిఫామ్‌తో లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపా రు. అలాగే, విద్యార్థులకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులో మార్పుల కోసం ఈనెల 18నుంచి మండల స్థాయిలో క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అలాగే, విద్యార్థుల హాజరు, పాఠశాలలు, భవిత సెంటర్లలో వసతుల కల్పన, బిల్లుల చెల్లింపు, విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సూచనలు చేశారు. ఈసమావేశంలో డీఈఓ ఎస్.సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్, ఆర్ అండ్ బీ ఈఈ పవార్ తదితరులు పాల్గొన్నారు.
67మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు
ఖమ్మంగాంధీచౌక్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా పూర్తిచేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతాలకుంట, రేజర్ల, పినపాక గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కలెక్టరేట్‌లో చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులకు 67ఇళ్లను కేటాయించామని తెలిపారు. దరఖాస్తుదారుల నుంచి యాతాలకుంటలో 40, రేజర్లలో 20, పినపాకలో ఏడుగురిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి నెరవేరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు ఆర్డీఓ ఎల్.రాజేందర్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
●ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ఇంటెలిజెన్స్ అధికారి రామోజీ రమేష్ శుక్రవారం కలెక్టర్ అనుదీప్‌ను మర్మాదపూర్వకంగా కలిశారు. ఇంటెలెజెన్స్ డీఎస్పీ వెంకన్నబాబు, సీఐలు శ్రీనివాసరావు, వై.వీ.ప్రసాద్, ఎస్‌ఐ హరిసింగ్, ఉద్యోగులు శ్రీని వాసరావు, విజయ్ పాల్గొన్నారు.