
ఇద్దరు తప్పనిసరి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలు ఉండడం మంచిది. తద్వారా ఒకరికి ఒకరు తోడు నిలిస్తే ధైర్యం, భరోసాగా ఉంటుంది. ఇప్పటి ఖర్చులను బేరీజు వేసుకుంటే
ఇద్దరిని పోషించడం కష్టమే. అయినా
మంచీ, చెడుల్లో సహకరించుకోవడానికి
అవకాశం ఉంటుంది.
– ఎన్.శ్రీనివాస్ – మౌనిక, ఖమ్మం
ఇద్దరైతేనే తోడూనీడ
ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలు ఉండాల్సిందే. తద్వారా వారే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒంటరి వారమనే భావన రాదు. కానీ ప్రసుత్త తరుణం విద్య, వైద్యానికి
పెరుగుతున్న ఖర్చులతో చాలా మంది ఒక సంతానానికే పరిమితం అవుతున్నారు.
– సుధీర్ – శ్రీలత, ఖమ్మం

ఇద్దరు తప్పనిసరి..