
●పాకనాటి కుటుంబం ఉన్నతి
పాకనాటి కుటుంబం ఉమ్మడిగా ఉంటూ ఉన్నత స్థితికి చేరింది. నేలకొండపల్లి మండలం అనంతనగర్‌కు చెందిన పాకనాటి ముత్తారెడ్డి, ముత్తమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంగా ఉన్న ముత్తారెడ్డి కుమారులను, కుమార్తెలను చదివించారు. పెద్ద కుమారులు ఇద్దరు వ్యవసాయం చేస్తుండగా, చిన్న కుమారులు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తెలు తాము ఎంచుకున్న వృత్తిలో రాణిస్తున్నారు. ఈ ఏడుగురికి 10 మంది సంతానం కలిగారు. వీరు ఉన్నత చదువులు చదివి స్థానికంగా, అమెరికాలో స్థిర పడ్డారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగితే అంతా కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబం ఐక్యంగా ఉంటూ ఉన్నతంగా నిలుస్తున్నారు.