
ఎంపీ సిఫారసుతో నలుగురికి సీఎంఆర్‌ఎఫ్
ఖమ్మంమయూరిసెంటర్: మోకాలి శస్త్రచికిత్స కోసం చేయూత ఇప్పించాలని కోరగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి నలుగురికి రూ.6లక్షలు మంజూరు చేయించారు. ఎంపీ సిఫారసుతో కారేపల్లి మండలం కొత్త కమలాపురానికి కొల్లి నాగమ్మ, జాలా ధనమ్మ, మొండేపూడి కృష్ణారావు, మండేపూడి సత్యమ్మకు నిమ్స్‌లో శస్త్రచికిత్సకోసం రూ.1.50లక్షల చొప్పున సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరయ్యాయి. వీరికి ఎల్‌ఓసీ(లెటర్‌ఆఫ్ క్రెడిట్) పత్రాలను ఎంపీ హై దరాబాద్‌లో మంగళవారం అందజేయగా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
సీజనల్ వ్యాధుల
కట్టడిపై దృష్టి
కారేపల్లి: వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కట్టడిపై ఉద్యోగులు దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ కళావతి బాయి సూచించారు. కారేపల్లి మండలం తవిసిబోడులో ఐటీడీఏ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మొబైల్ హెల్త్ యూనిట్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సమావేశమై పారిశుద్ధ్య పనుల నిర్వహణ, వైద్యశిబిరాల ఏర్పాటుపై సూచనలు చేశా రు. ప్రజలు వ్యక్తిగతంగానే కాక పరిసరాల పరి శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం సీతారాంపురంలోని ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కారేపల్లి పీహెచ్‌సీని కూడా డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి సురేష్, ఉద్యోగులు పాల్గొన్నారు.
యంత్రాలు సకాలంలో అందాయా?
నేలకొండపల్లి: ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కావాల్సి న యంత్ర పరికరాలు సకాలంలో అందాయా, లేదా అన్న అంశంపై రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రొఫె సర్ బీ.ఎన్.రావు ఆరా తీశారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం వచ్చిన ఆయన ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం నిర్ధారణ యంత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలను పరిశీలించారు. ఆతర్వాత మార్కెట్ కార్యాలయంలో సొసైటీల సీఈఓలు, ఐకేపీ, మార్కెట్ ఉద్యోగులతో సమావేశమైన బీ.ఎన్.రావు మా ట్లాడారు. ఈ సమావేశానికి రైతు ప్రతినిధుల ను కూడా ఆహ్వానించి కొనుగోలు కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, అందిన పరికరాలపై ఆరాతీయడంతో పాటుఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమా అని చర్చించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
వెండి, బంగారు
ఆభరణాలు చోరీ
కామేపల్లి: మండలంలోని తాళ్లగూడెంలో ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు వెండి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన తూరపాటి వెంకన్న సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయాన గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలకొట్టి బీరువాలో దాచిన 40తులాల వెండి, ఆరు గ్రాముల బంగారపు ఆభరణాలను చోరీ చేశారు. సాయంత్రం ఇంటికి వచ్చాక చోరీ జరిగిందని గుర్తించిన వెంకన్న మంగళవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎంపీ సిఫారసుతో నలుగురికి సీఎంఆర్‌ఎఫ్

ఎంపీ సిఫారసుతో నలుగురికి సీఎంఆర్‌ఎఫ్