సరిపడా ఎరువుల నిల్వలు | - | Sakshi
Sakshi News home page

సరిపడా ఎరువుల నిల్వలు

Jul 10 2025 6:25 AM | Updated on Jul 10 2025 6:25 AM

సరిపడ

సరిపడా ఎరువుల నిల్వలు

సత్తుపల్లిటౌన్‌: వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు జిల్లాలో సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య స్పష్టం చేశారు. సత్తుపల్లి, రామానగరంలోని ఎరువుల దుకాణాలు, గోదాంలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. కొరత పేరిట ఎరువుల ధరలు పెంచినా, అనవసరమైన సామగ్రి అంటగట్టినా డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓలు పాల్గొన్నారు.

నేటి నుంచి ఏఐసీసీ

కార్యదర్శి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి గురువారం నుంచి శనివా రం వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నా రు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన ఆయన సంస్థాగత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈమేరకు 10వ తేదీ గురువారం ఖమ్మంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నా రు. ఆతర్వాత పార్టీ ముఖ్యలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. అలాగే, శుక్ర, శనివారాల్లోనూ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారని వివరించారు.

రేపు జాబ్‌మేళా

ఖమ్మం రాపర్తినగర్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ నెల 11వ తేదీన ఖమ్మం టేకులపల్లిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌. మాధవి తెలిపారు. రిలయన్స్‌ కంపెనీలో 25 రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌లతో ఉదయం 10గంటలకల్లా హాజరుకావాలని ఆమె సూచించారు.

సినిమాటోగ్రఫీ రంగంలో నైపుణ్య కోర్సులు

ఖమ్మం సహకారనగర్‌: సినిమాటోగ్రఫీ రంగంలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు ప్రారంభిస్తున్నామని న్యాక్‌(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.వెంకటరాజు తెలిపారు. శశి ప్రీతం అకాడమీ ఆఫ్‌ సినిమా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(స్పేస్‌) సౌజన్యంతో సినిమాటోగ్రఫీ, వీడి యో ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌, డబ్బింగ్‌ అండ్‌ వాయిస్‌ ఓవర్‌ స్కిల్‌, యాంకరింగ్‌ అండ్‌ ఈఎంసీఈఈ, డిజిటల్‌ డిజైన్‌ అండ్‌ సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌, ప్రొఫెషనల్‌ సింగింగ్‌, ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌ తది తర కోర్సుల్లో 12 వారాల శిక్షణ ఉంటుందని వెల్ల డించారు. ప్రతీ కోర్సుకు రూ.35 వేల ఫీజు నిర్ణయించగా, రెండు కంటే ఎక్కువ కోర్సులకు రాయితీ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని న్యాక్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వనుండగా, శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వం సర్టిఫికెట్‌ జారీ చేస్తుందని వెల్లడించారు. వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లింపు, రాయితీపై హాస్టల్‌ వసతి ఉన్నందున ఆసక్తి ఉన్నవారు సద్విని యోగం చేసుకోవాలని ఏడీ సూచించారు.

రెమ్యూనరేషన్‌

చెల్లించాలని వినతి

మధిర: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్‌ చెల్లించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం మధిర తహసీల్దార్‌ ఆర్‌.రాంబా బుకు వినతిపత్రం అందజేశాక యూనియన్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ నాగూర్‌ వలీ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను ఉపాధ్యాయులు విజయవంతం చేసినా, ఇప్పటికీ రెమ్యూనరేషన్‌ చెల్లించలేదన్నారు. దీనికి తోడు డ్యూటీ సర్టిఫికెట్లు మంజూరు చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు.

పీడీఎస్‌యూ

జిల్లా కమిటీ ఎన్నిక

ఖమ్మం మామిళ్లగూడెం: పీడీఎస్‌ యూ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా తిప్పారపు లక్ష్మణ్‌, ఒంగూరి వెంకటేష్‌ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా వినయ్‌, యశ్వంత్‌, సహాయ కార్యదర్శులుగా సాధిక్‌, చందు, కోశాధికారి శశికిరణ్‌ను ఎన్నుకున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ బుధవారం ఖమ్మంలో ప్రకటించారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌, వెంకటేష్‌ మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యల ను ప్రభుత్వం ష్టికి తీసుకెళ్లేలా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు.

సరిపడా ఎరువుల నిల్వలు
1
1/2

సరిపడా ఎరువుల నిల్వలు

సరిపడా ఎరువుల నిల్వలు
2
2/2

సరిపడా ఎరువుల నిల్వలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement