
ఎల్లన్ననగర్‌లో త్వరలోనే పాఠశాల
కొణిజర్ల: మండలంలోని ఎల్లన్ననగర్‌లో పాఠశాల లేక, బయటకు వెళ్లాలంటే రహదారి లేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి పలువురు తీసుకెళ్లారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు గ్రామంలో పాఠశాల నడిపించినా, ఇప్పుడు మూసివేయడంతో బడి ఈడు పిల్లలు ఇంటికే పరిమితుతున్నారని తెలియడంతో ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో డీఈఓ సామినేని సత్యనారాయణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.కళావతిబాయి, ఆర్‌టీసీ అధికారులు మంగళవారం గ్రామంలో పర్యటించా రు. ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై గ్రామానికి పంపించి పాఠశాల నిర్వహించాలని ఎంఈఓ డి.అబ్రహంను డీఈఓ ఆదేశించారు. అలాగే, పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు అందజేసి మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చాలని సూచించారు. అలాగే, స్టాఫ్‌నర్స్, ఆశా కార్యకర్తను నియమిస్తామని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి వెల్ల డించగా, గ్రామానికి రోడ్డు వేస్తే బస్సు నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ రాజశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కరామత్ అలీ, సూర్యనారాయణ, అచ్యుత్, సీఆర్‌పీలు పవన్, సైదబాబు పాల్గొన్నారు.