
ఏపీపీగా బాధ్యతలు స్వీకరించిన శరత్
ఖమ్మం లీగల్: ఖమ్మం ఒకటో అదనపు సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)గా జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రాసిక్యూషన్ డీడీ కార్యాలయంలో నియామకపత్రం అందజేశాక జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, న్యాయమూర్తి ఉమాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, హరేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సంపత్, హేమంత్, శేఖర్, జానీ పాల్గొన్నారు.
నేడు ఐఏఎల్
అవగాహన సదస్సు
మధిర/ఖమ్మంలీగల్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) ఆధ్వర్యాన శని వారం మధిరలో జరగనున్న న్యాయవాదుల అవగాహన తరగతులకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ హాజరు కానున్నారని న్యాయవాది వాసిరెడ్డి వెంకటేశ్వరరావు తెలిపారు. మధిరలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో వచ్చిన మార్పులపై న్యాయవాదులకు అవగా హన కల్పించాలనే భావనతో ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఈసందర్భంగా కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలు, మార్పలపై జస్టిస్ బి.చంద్రకుమార్ బోధిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఐఏఎల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్లారావు, జె.రమేష్‌తో పాటు కావూరి రమేష్, తేలపోలు వెంకట్రావు, జీ.వీ.లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, డి.జగన్మోహన్‌రావు, కోట జ్ఞానేష్, సీహెచ్.రామరాజు, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
900 గ్రాముల
గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ సంధ్య ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా.. కొత్తగూడెంకు చెందిన మోహిత్ గంజాయి అమ్ముతూ కొత్త బస్టాండ్ సమీపంలోని గుట్టపై పట్టుబడ్డాడు. ఆయన నుంచి రూ.30వేల విలువైన 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాక కొనుగోలుకు వచ్చిన గోపాలపురం, జహీర్‌పురవాసులు బాదావత్ ప్రవీణ్, దూర్ సందీప్, దోన్‌వాన్ సాయివినయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.