
‘తోపుడుబండి’ ఆధ్వర్యాన డ్యూయెల్ డెస్క్ బెంచీలు
సత్తుపల్లి/కల్లూరురూరల్: తోపుడు బండి ఫౌండేషన్ చైర్మన్, దివంగత సాదిక్‌అలీ జయంతి సందర్భంగా ఆయన సతీమణి ఉష ప్రభుత్వ పాఠశాలలకు రూ.4లక్షల విలువైన డ్యూఝెల్ డెస్క్ బెంచీలను గురువారం అందజేశారు. కల్లూరు మండలం కొర్లగూడెం, ఖాన్‌ఖాన్‌పేట, ఎన్నెస్పీ పాఠశాలకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి చేతుల మీదుగా అందించగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాదిక్‌అలీ మాదిరిగానే ఆయన కుటుంబీకులు అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. కల్లూరు మార్కెట్, సీడీసీ చైర్మన్లు భాగం నీరజాదేవి, నరేంద్ర, ఎస్సై హరిత, హెచ్‌ఎం చక్రవర్తితో పాటు కిషోర్‌దత్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి – దయానంద్ కుమార్తె ఆషా వర్ధంతిని సత్తుపల్లిలో నిర్వహించగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి, నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దొడ్డా శ్రీనివాసరావు, చల్లగుళ్ల నర్సింహారావు, దోమ ఆనంద్, చల్లారి వెంకటేశ్వరరావు, ఎం.డీ.కమల్‌పాషా, తోట సుజలరాణి, మట్టా సుజాత, డాక్టర్ శృతి పాల్గొన్నారు. అలాగే, గౌరిగూడెంలో మందపాటి ముత్తారెడ్డి తల్లి కోటమ్మ ఇటీవల మృతి చెందగా కుటుంబీకులను పరామర్శించారు.