సంక్షిప్త సమాచారం
యోగాతోనే ఆరోగ్యం
మధిర: ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు వెంకట్ లాల్ తెలిపారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధిర ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగా చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు కందుల రాంబాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
కారేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి.ఝాన్సీ అన్నారు. శనివారం మండలంలోని టేకులపల్లిలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే, కాంగ్రెస్ ప్రభుత్వం అవలవంభిస్తున్నదన్నారు. జూన్ 21,22 తేదీల్లో నిజామాబాద్‌లో కార్మిక సమస్యలపై జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ మండల కార్యదర్శి ఉమ్మడి సందీప్, నాయకులు తేజ్యానాయక్, భాస్కర్, సక్రు, సత్తిరెడ్డి, సరోజిని, అనసూర్య, లఘుపతి, రంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
కొణిజర్ల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని సీపీఐ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రా బాబు అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునగాలలో నాగవరపు భద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. అనంతరం శాఖ కార్యదర్శిగా పాపగంటి సుదర్శన్, సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి నాగయ్యలతో పాటు మరో 11మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరరావు, సుదర్శన్, భద్రయ్య, సంసోన్, నాగయ్య, విజయ్‌కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభలను జయప్రదం చేయండి
మధిర: మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే సీపీఐ జిల్లా 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు తెలిపారు. శనివారం స్థానిక రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో నిర్వహించిన సీపీఐ ఆహ్వాన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులపై చర్చించడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి మహాసభల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెజవాడ రవిబాబు, మందడపు రాణి, ఊట్ల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ మరణం పార్టీకి తీరని లోటు
తల్లాడ: కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి తేజావత్ బాలాజీ నాయక్ మరణం బీజేపీ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని అంజనాపురంలో నిర్వహించన ఆయన సంస్మరణ సభలో బీజేపీ నాయకులు పాల్గొని, బాలాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, వెంకటేశ్వరరావు, మదుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెట్లు నిర్మించాలని వినతి..
వైరారూరల్: మండలంలోని తాటిపూడిలో వైరా రిజర్వాయర్ కుడి కాలువ ఆధునికీకరణ పనులలో భాగంగా భక్తులు కార్తీక మాసాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కాలువకు ఇరువైపులా మెట్లు నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ వెంకటకృష్ణకు శనివారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాగరాజు, జయరాజు, నిర్మల, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సంక్షిప్త సమాచారం
సంక్షిప్త సమాచారం
సంక్షిప్త సమాచారం


