తండ్రి కృషి.. డాక్టర్‌గా బిడ్డ
తిరములాయపాలెం: కుమారుడు జన్మించినప్పుడే డాక్టర్‌గా చూడాలని ఆ తండ్రి కల కన్నాడు. ఆ కల నిజమయ్యేలా కష్టపడి చదవడం అలవాటు చేయడంతో తండ్రి కోరికను నెరవేర్చిన బిడ్డ ఇప్పుడు పేదలకు వైద్య సేవలందిస్తుండడం విశేషం. తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన బత్తిని జగన్మోహన్‌రావు గ్రామాల్లో తిరుగుతూ వాయిదాల పద్ధతిలో వస్తువులు అమ్మే వ్యాపారం చేస్తాడు. పూసల కుటుంబంలో పుట్టిన ఆయనలాంటి ఇంకొందరు పిల్లలను సైతం అదే వ్యాపారం చేయిస్తున్నారు. కానీ జగన్మోహన్‌రావు చిన్న నాటి నుండే పిల్లలపై శ్రద్ధ వహిస్తుండగా కుమారుడు సాయికుమార్ ఎండీ(జనరల్ మెడిసిన్) పూర్తి చేసి కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా సేవలందిస్తున్నాడు. అంతేకాక కుమార్తె రాణి బీటెక్ పూర్తిచేసింది. కుమారుడిని మెడిసిన్ చదివించే సమయాన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదల వీడని జగన్మోహన్‌రావు ఇప్పుడు సాయి ఎదుగుదలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.


