
ఎస్సెస్సీ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ప్రతిభ చాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యాన రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ బహుమతులు అందజేసి అభినందించారు. మొదటి బహుమతి రూ.25 వేలతో పాటు ల్యాప్‌టాప్‌ను పచావ వెన్నెల, మాఘం యశ్వంత్ రూ.25 వేలు, చింతోజు సాయి రూ.15 వేలు అందుకోగా, తిరుమలదాసు మాధురి, రామిశెట్టి ఉమ, ఆవుల శ్రీమన్య, గోడ లక్ష్మి, పుచ్చకాయల భవ్య, చందా భావనకు రూ.10 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. తొలి ఐదు స్థానాల్లో నిలిచిన ఐదుగురు విద్యార్థులను ఢిల్లీకి విమానంలో మూడు రోజుల యాత్రకు తీసుకెళ్తామని తెలిపారు. మిత్ర ఫౌండేషన్ డైరెక్టర్లు రంగా శ్రీనివాస్, పోలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగంధర్, నాగసాయి నగేశ్, ప్రసేన్, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ బాధ్యులు, వైరా ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దొడ్డా వరప్రసాద్, కిరణ్‌కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మొదటి ఐదుగురికి విమానయానం కూడా..