
అంబేద్కర్ ఆశయసాధనే లక్ష్యం
తిరుమలాయపాలెం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు. మండలంలోని హస్నాబాద్‌లో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగంతోనే అందరికీ విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయని తెలిపారు. అనేక ఆటుపోట్లను తట్టుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ మాగి వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం, రిటైర్డ్ ఫ్రొఫెసర్ ముత్తయ్య, పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్యతో పాటు వెన్నెబోయిన రమేష్, కీసర సంకీర్త్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, చింతరాల నాగభూషణం, సుదర్శన్, మాగి వెంకన్న, యాతాకు ల నగేష్, మాగి లక్ష్మయ్య, మాగి బాలకృష్ణ, సత్తిరెడ్డి, శ్రీనివాస్, పల్లి నాగయ్య, మాగి ఉపేందర్, మాగి రాకేష్, సంతోష్, ఉప్పలయ్య పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణలో ఎమ్మెల్సీ కోదండరామ్