
పాస్‌బుక్ కలిగిన రైతులందరికీ రిజిస్ట్రేషన్
కొణిజర్ల: పట్టాదారు పాస్‌బుక్ కలిగిన ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా కేంద్రప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని తనికెళ్ల రైతు వేదికలో రైతుల రిజిస్ట్రేషన్‌ను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన నంబర్ కలిగిన ఫోన్‌తో ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. కాగా, దుక్కులు దున్నడానికి ఇదే అనువైన సమయమని, తద్వారా వర్షాలు కురవగానే భూమి గుల్లబారి విత్తనాలు నాటొచ్చని వెల్లడించారు. వైరా ఏడీఏ టి కరుణశ్రీ, ఏఓ బాలాజీ, ఏఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

పాస్‌బుక్ కలిగిన రైతులందరికీ రిజిస్ట్రేషన్