
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వైరారూరల్: అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అదనపు సిబ్బంది, యంత్రాలను సమకూర్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైరా మండలంలోని భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా వైరా నదికి కరకట్ట, చెక్ డ్యామ్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో చేపడుతున్న పనులను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శీలం వెంకటనర్సిరెడ్డి, నాయకులు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, పమ్మి అశోక్, వడ్డె నారాయణరావు తదితరులున్నారు.
యంగ్ ఇండియా స్కూల్ స్థలానికి హద్దులు
బోనకల్: బోనకల్ మండలంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సంబంధించి స్థలం ఖరారైంది. ఈమేరకు 25ఎకరాల స్థలాన్ని గుర్తించగా సర్వే అనంతరం మంగళవారం జిల్లా సర్వేయర్ వెంకటరావు హద్దులు నిర్ధారించారు. తహసీల్దార్ పూనం చందర్, సర్వేయర్ కృష్ణయ్యతో కలిసి హద్దు రాళ్లు పాతారు. అయితే, పాఠశాల అవసరాలకు మరో ఐదెకరాల భూమి కూడా సేకరించనున్నట్లు తహసీల్దార్ చందర్ తెలిపారు.