
నర్సుల సేవలు వెలకట్టలేనివి..
ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రుల్లో నర్సుల సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు అన్నారు. ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓలు రాంబాబు, రాథోడ్ వినాయక్‌తో కలిసి ప్రిన్సిపాల్ కేక్ కట్ చేసి మాట్లాడారు. వ్యాధులతో బాధపడే వారికి స్వస్థత చేకూర్చడంలో వైద్యులతో సమానంగా నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ సూపరింటెండెంట్లు శాంతకుమారి, ఇందిరమ్మతో పాటు రత్నకుమారి, జి.లక్ష్మి, ఎమేలియా మేరి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన కళాశాలల్లో
ప్రవేశానికి కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూని యర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కళాశాల్లో సీటభర్తీ కోసం ఈనెల 15న బాలికలకు, 16న బాలురకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఉదయం 9గంటలకు మొదలయ్యే కౌన్సెలింగ్‌కు 2024–25లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94909 57271, 94909 57270 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
ఆన్‌లైన్‌లో వివరాలు
తప్పనిసరి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ అధికారులు పూర్తి వివరాలతో రికార్డులు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి ఆదేశించారు. ఆస్పత్రులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్లకు కలెక్టరేట్‌లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణకు పంపిణీ చేసే మందులు, అవసరమైన స్టాక్ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, డెమో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు
పొడిగింపు
25 శాతం రాయితీతో
ఈనెల 31వరకు అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ఈనెల 3తో ముగియగా.. మరోసారి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి కె.ఇలంబర్తి పేరిట సోమవారం ప్రకటన విడుదలైంది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు 25శాతం రాయితీ పొందేందుకు మరో అవకాశం లభించింది. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల నుండి ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నందున యువత సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువక కేంద్రం ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేష్ సూచించారు. అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశమున్నందున యువత ముందుకు రావాలని సూచించారు. ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందన, పునరావాస ప్రయత్నాల్లో తోడ్పాటులో యువతకు అవకాశం ఇవ్వున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వివరాల కోసం htpps// mybharat. gov. in లేదా 94913 83832 నంబర్‌లో సంప్రదించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు.

నర్సుల సేవలు వెలకట్టలేనివి..