
క్రీడలతో ఏకాగ్రత, శారీరక అభివృద్ధి
కొణిజర్ల: విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఏకాగ్రత పెరగడమే కాక శారీరక అభివృద్ధి సాధ్యమవుతుందని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. కొణిజర్ల మండలం తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ చేసిన డీవైఎస్‌ఓ మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యకరమైన జీవన శైలి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు శ్రీనివాస్, రంజాన్, ఉపాధ్యాయులు భాస్కర్‌రావు, గోపాలరావు, అచ్యుతరావు, రాంబాబు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.