
ఉద్యమకారులు అధైర్యపడొద్దు
ఖమ్మం మామిళ్లగూడెం : జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడొద్దని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన మోసపూరిత మాటల వల్లే నేడు ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందన్నారు. కొట్లాడి సాధించిన రాష్ట్రంలో అసలైన ఉద్యమకారులను నేడు వెనక్కు నెట్టేశారని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థులు, ప్రజల ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే పెత్తనం చేసిందని అన్నారు. తనకు ప్రస్తుత ప్రభుత్వంలో అయినా కాస్త గుర్తింపు రావడంతో ఉద్యమకారుల పక్షాన శాసనమండలిలో మాట్లాడగలుతున్నామని చెప్పారు. ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ దక్కిందన్నారు. సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్‌రావు, పల్లె వినయ్‌కుమార్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు, నాయకులు పసుపులేటి నరసయ్య, మహబూబ్ బాషా, ప్రసాద్, అక్బర్, డేవిడ్, సయ్యద్ సలీంపాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడిగా మధిర నియోజకవర్గానికి చెందిన షేక్ సర్దార్ హుస్సేన్‌ను నియమిస్తున్నట్లు కోదండరామ్ ప్రకటించారు.
మీటర్ రీడింగ్ కార్మికుల వినతి..
రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు కోదండరామ్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో సుమారు 2వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, విద్యుత్ సంస్థకు ఆదాయం సమకూరుస్తున్న తమకు సరైన న్యాయం జరగడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. పీస్‌రేట్ పద్ధతి కాకుండా నెలవారీ వేతనం ఇవ్వాల ని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. నాయకులు వేమూరి వీరయ్య, నాగేశ్వరావు, అనిల్, మల్లేశ్వరరావు, వంశీ, నాగార్జు న, బాలు, నరేష్, నవీన్, మధు పాల్గొన్నారు.
టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్