
వేసవిలో పక్షులకు నీరందించాలి
ఖమ్మంవన్‌టౌన్ : వేసవి కాలంలో పక్షులకు నీరందించేందుకు జిల్లా అటవీ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ‘ఏ బౌల్ ఆఫ్ వాటర్.. సేవ్ వింగ్స్’ నినాదంతో పాటు సేవ్ ఫారెస్ట్–సేవ్ నేషన్, సేవ్ వాటర్–సేవ్ ప్లాంట్ వంటి పర్యావరణ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆదివారం ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ నుంచి వెలుగు మట్ల అర్బన్ పార్కు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీపీ సునీల్‌దత్, డీఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. వేసవిలో పక్షుల దాహార్తి తీర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కాగా, ర్యాలీలో పాల్గొన్న సైకిల్ రైడర్లు.. పక్షులకు నీరందించే మట్టిగిన్నెలు కొనుగోలు చేసి అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. అంతేకాక ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వన విజ్ఞాన్ సమ్మర్ క్యాంప్‌లో మొక్కల పెంపకం, ట్రెక్కింగ్, పర్యావరణ అవగాహన, సైక్లింగ్, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. హాజరైన విద్యార్థులకు సీపీ,, డీఎఫ్‌ఓ, ఇతర సిబ్బంది ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ మంజుల, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీ సునీల్‌దత్, డీఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్