
ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని విట్స్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్‌మెంట్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్‌హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి ఒక స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్‌మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా చేయడం జరుగుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోష్ పాల్గొన్నారు.