
కర్ణాటకలో సత్తా చాటిన ఖమ్మం విద్యార్థిని
ఖమ్మంసహకారనగర్: కర్ణాటక రాష్ట్రం బెల్గాం నగరంలోని ఏ.ఎం.షేక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ఖమ్మం నగరానికి చెందిన తుమ్మలపల్లి చరిత అత్యధిక మార్కులతో బీహెచ్‌ఎంఎస్ పూర్తిచేసింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె బంగారు పతకం సాధించడమే కాక ప్రతిష్టాత్మక డాక్టర్ బత్రాస్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికై ందని కుటుంబీకులు తెలిపారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ హోమి యోపతి డీన్ డాక్టర్ సహిదా ఎ.శిరసాంగి చేతుల మీదుగా పట్టా, బంగారు పతకం అందుకుందని వెల్లడించారు. తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు చిన్న కుమార్తె అయిన చరిత బీహెచ్‌ఎంఎస్‌లో చేరిన కొన్నాళ్లకే రామారావు మృతి చెందారు. అయినా బాధ దిగమింగుకుని నాలుగేళ్ల కోర్సులో ఏటా మొదటి ర్యాంకు సాధిస్తూ చివరికి బంగారు పతకం సాధించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన చరిత తల్లి విజయలక్ష్మి, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, తన తండ్రి రామారావు కోరిక మేరకు పేద ప్రజలకు వైద్య సేవలందిస్తానని చరిత వెల్లడించింది.
బీహెచ్‌ఎంఎస్‌లో టాపర్‌గా బంగారు పతకం