
●అమ్మ ప్రోత్సాహంతో జేఎల్‌గా..
కరకగూడెం: భర్త చనిపోయినా మనోధైర్యం కోల్పోకుండా ఓ మహిళ తన కూతురిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అమ్మ కష్టం వృథా కాకుండా కూతురు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం వెంకన్న – సరోజన దంపతులకు రెండో సంతానం రమాదేవి. రమాదేవి ఒకటో తరగతి నుంచి బీఈడీ వరకు గురుకుల విద్యాసంస్థలో చదువుకుంది. కేయూలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంఏ ఆంగ్లం పూర్తి చేసింది. ఇంటర్‌లో ఉన్నప్పుడు తండ్రి చనిపోయా డు. అప్పటి నుంచి తల్లి ప్రోత్సాహంతో చదువులో ముందుకు సాగింది. గు రుకుల ఉద్యోగాల్లో జేఎల్ ఇంగ్లిష్, పీజీ టీ ఇంగ్లిష్, టీజీటీ ఇంగ్లిష్, టీజీటీ మ్యాథమెటిక్స్ ఉద్యోగాలకు ఎంపికై పలువురికి అదర్శంగా నిలిచింది.