
ఖమ్మంలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు
ఖమ్మం మయూరిసెంటర్: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర నాలుగో మహా సభలను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించి నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో గుండు మాధవరావు అధ్యక్షతన శుక్రవా రం జరిగిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మంలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ మహాసభల నిర్వహణకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీని వాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులందరూ సభల జయప్రదానికి సహకరించాలని కోరారు. అనంతరం సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా కళ్యాణం వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పిట్టల సుధాకర్, కోశాధికారిగా గుగ్గిళ్ల రోశయ్యను రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ ప్రతిపాదించగా ఆమోదించారు. ఈ సమావేశంలో సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ తదితర సంఘాల నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, వై.విక్రం, పిట్టల రవి, కుడుదుల వెంకన్న, తోకల బాబు, పగిళ్లపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.