
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట గ్రామానికి చెందిన భూక్యా కల్యాణి(22) సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. కొంత కాలంగా పెనుబల్లి మండలానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుండగా, ఇటీవల ఆయన పెళ్లికి నిరాకరించాడని తెలిసింది. దీంతో సత్తుపల్లిలోని మసీద్ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంట్లో బుధవారం రాత్రి చీరతో ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కవిత తెలిపారు.
చికిత్స పొందుతున్న
యువకుడు మృతి
వైరారూరల్: మద్యానికి బానిసైన ఓ యువకుడు పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గన్నవరానికి చెందిన శీలం ఉపేందర్‌రెడ్డి(31) మద్యానికి బానిస కాగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో 2వ తేదీన పురుగుల మందు తాగిన ఆయన ఖమ్మం ఆస్పత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన తండ్రి వెంకటేశ్వరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ భాగ్యరాజ్ తెలిపారు.
వీ.వీ.పాలెంలో వృద్ధుడు...
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంకు చెందిన చీటి కోటయ్య(79) అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చికిత్స చేయించుకున్నా ఫలితం లేక మనస్థాపంతో బుధవారం గడ్డి మందు తాగాడు. ఈ విషయం గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటయ్య కుమారుడు మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
ఆటో బోల్తా, కూలీలకు గాయాలు
కూసుమంచి: కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కూసుమంచిలోని గంగాదేవి గుడి సమీపాన గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తురకగూడెం గ్రామానికి చెందిన కూలీలు ట్రాలీ ఆటోలో మిర్చి ఏరేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గంగాదేవి ఆలయ సమీపంలోకి రాగానే అటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఎనిమిది కూలీలకు గాయాలు కాగా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అయితే, అక్కడ సరైన చికిత్స అందక ఇబ్బందులు ఎదురయ్యాయని క్షతగాత్రులు వాపోయారు.
లారీని ఢీకొని యువతికి..
వైరా: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం పాతమున్సిపాలిటీ కార్యాలయంలోని లైబ్రరీ లో కాంట్రాక్ట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అడపా భవాని వైరా మండలం గన్నవరంలో జరిగే స్నేహితురాలి వివాహానికి గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. వైరా బాలాజీనగర్ పాత శివాలయం సమీపాన ఆగిఉన్న లారీని వెన క నుంచి ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా అందుబాటులోకి రాకపోవడంతో అటుగా వస్తు న్న వైరా ఆర్‌ఐ ప్రసాద్, తదితరులు భవానీని తన కారులో వైరా పీహెచ్‌సీకి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, భవానీ ద్విచక్ర వాహనం కొనుగోలుచేసి మూడు రోజులే అయినట్లు తెలుస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరగడం గమనార్హం.