
ప్రభుత్వ బడుల్లో వేసవి శిబిరాలు
● ఈనెల 10నుంచి 46స్కూళ్లలో నిర్వహణ ● 4,600మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ
నేలకొండపల్లి: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యాన ఈ శిబిరాల నిర్వహణకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
46 ఉన్నత పాఠశాలలో...
జిల్లాలోని 46 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద యం 8నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో పాఠశాలలో కనీసం వంద మంది చొప్పున 4,600 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో కేంద్రంలో నలుగురు శిక్షకుల సాయంతో కనీసం నాలుగు అంశాల్లో తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, శిక్షణ సమయాన విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వనుండగా, శిక్షకులకు గౌరవ వేతనం అందిస్తారు.
ప్రవేశాలు ఇలా....
శిబిరాల్లో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కు తొలి ప్రాధాన్యత ఇస్తారు. మొదటి రోజు ఆధార్‌కా ర్డు, పాఠశాల వివరాలతో హాజరైతే ప్రవేశం కల్పిస్తా రు. ఆసక్తి కలిగిన విద్యార్థులు వచ్చేలా ఉపాధ్యాయులు ఇప్పటికే సమాచారం సమాచారం ఇస్తున్నారు.
అంశాలు ఇవే...
మండల కేంద్రాలో వనరులు, శిక్షకులు సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షణ అంశాలను ఎంపిక చేశారు. చదరంగం, క్యారమ్స్, స్కి ప్పింగ్, వైకుంఠపాళి తదితర ఆటలే కాక, డ్రాయింగ్, పెయింటింగ్, సాధన కాగితాలతో బొమ్మలు తయారు చేయడంపై శిక్షణ ఉంటుంది. అంతేకాక చిన్నచిన్న సైన్స్ ప్రయోగాలు, కర్రసాము, యోగా, నృత్యం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
తొలిసారిగా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగపడేలా మండల కేంద్రాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా ఆసక్తి ఉన్న అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు.
– సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి

ప్రభుత్వ బడుల్లో వేసవి శిబిరాలు