
వేలంపాటలో రూ.5.21లక్షల ఆదాయం
కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయంలో వివిధ పనులకు గురువారం వేలం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యాన దుకాణాల సముదాయం కేటాయింపు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, టెంట్ సామగ్రి అద్దెకు ఇచ్చేందుకు వేలం నిర్వహించగా, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు గుగులోతు నవీన్ రూ.15,500తో దక్కించుకున్నారు. అలాగే, షాపులు ఒక్కొక్కటి గత ఏడాది రూ.28,800కి ఇవ్వగా, ఈసారి రూ.31,800 ధర పలికాయి. తద్వారా ఆరు షాపుల ద్వారా రూ.1,90,800, టెంట్ సామగ్రి సరఫరాను గుగులోతు దస్రు రూ.3.15లక్షలతో దక్కించుకున్నాడు. మొత్తంగా రూ.5,21,300 ఆదాయం నమోదైందని ఈఓ వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పగడాల మోహన్‌కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.