
ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు అభినందనీయం
ఖమ్మంమయూరిసెంటర్: పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడి అభినందనీయమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మంలోని పార్టీజిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మాట్లాడారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండగా, కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదం లేని ప్రపంచమే బీఆర్‌ఎస్ విధానం అయినందున భారత సైన్యం చేపట్టిన చర్యలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లోనూ సైన్యానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. కాగా, ఈనెల 9న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లాడలో జరిగే రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు ఖమర్, బెల్లం వేణుగోపాల్, నాగరాజు, భాషబోయిన వీరన్న, ఉప్పల వెంకటరమణ, బిచ్చల తిరుమల్‌రావు, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్