
టీపీసీసీ లీగల్ సెల్‌లో జిల్లా న్యాయవాది
ఖమ్మంలీగల్/ఎర్రుపాలెం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్, ఆర్‌టీఐ కన్వీనర్‌గా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన న్యాయవాది కోన చంద్రశేఖర్‌గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రశేఖర్‌గుప్తా గతంలో ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాంరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు
పందిళ్లపల్లి విద్యార్థిని
చింతకాని: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి జరగనున్న 51వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో చింతకాని మండలం పందిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కేతవరపు దీక్షిత పాల్గొననుంది. తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టుకు ఆమె ఎంపికై ందని పాఠశాల హెచ్‌ఎం ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షితను హెచ్‌ఎంతో పాటు పీడీ కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందించారు.
మానవత్వం చాటుకున్న యువకులు
తల్లాడ: మండలంలోని మిట్టపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇంకో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు మిసైల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యాన సేకరించిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని బుధవారం అందించారు. ప్రమాద బాధితుడు గుత్తికొండ వినోద్‌ను పరామర్శించి ఆయన భార్య రేవతికి నగదు అందజేశారు. సంస్థ బాధ్యులు వడ్డాణపు నరేశ్, పొన్న శ్రీకాంత్, చిట్టెం బ్రహ్మం, అజయ్, మారేశ్, పెంట్‌సాహెబ్, బాలు పాల్గొన్నారు.
యూటీ పనులు
ప్రారంభం
కూసుమంచి: గతేడాది వచ్చిన వరదలతో పాలేరు రిజర్వాయర్ ఔట్‌ఫ్లో కాల్వ (ఎడమ కాల్వ) కట్టకు మత్స్య పరిశోధనా కేంద్రం సమీపాన యూటీ (అండర్ టన్నెల్) వద్ద భారీ గండి పడింది. అప్పట్లో గండిని తాత్కాలికంగా పూడ్చివేసిన అధికారులు, ప్రస్తుతం కొత్తగా యూటీ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. రూ.10 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులను బుధవారం జల వనరుల శాఖ ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాల్వ ద్వారా ఖమ్మం నగరానికి విడతల వారీగా తాగునీరు సరఫరా చేయనుండగా ప్రస్తుత పనులతో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అని కేఎంసీ ఇంజనీర్ రంజిత్‌తో ఎస్‌ఈ చర్చించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా జరిగేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. జల వనరుల శాఖ ఈఈ అనన్య, డీఈఈ అనన్య, డీఈఈలు మాధవి, మధు పాల్గొన్నారు.

టీపీసీసీ లీగల్ సెల్‌లో జిల్లా న్యాయవాది

టీపీసీసీ లీగల్ సెల్‌లో జిల్లా న్యాయవాది