
ఉద్యోగి కుటుంబానికి భద్రతా ఎక్స్‌గ్రేషియా చెక్కు
ఖమ్మంక్రైం: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన ఎం.డీ.హనీఫ్ కుటుంబానికి భద్రతా ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. ఈమేరకు రూ.14,98,610 చెక్కును మంగళవారం ఆయన కుటుంబీకులకు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అందజేసి మాట్లాడారు. శాఖాపరంగా ఎలాంటి సహకారమైన అందిస్తామని తెలిపారు.
జేవీఆర్ ఓసీలో పరిశీలన
సత్తుపల్లిరూరల్: మండలంలోని జేవీఆర్ ఓసీని సింగరేణి కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ మంగళవారం తనిఖీ చేశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన పని ప్రదేశాలు, కార్యాలయాలను పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, తొలి సారి ఓసీకి వచ్చిన అభిలాష్‌కు సెక్యూరిటీ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. ఉద్యోగులు బందెల విజయేందర్, మల్లేష్, రవీందర్‌రెడ్డి, ఎం.జోసెఫ్, కేఎస్‌వీవీ.సత్యనారాయణ, ఎస్.కే.సుభానీ, మోతుకూరి రవి తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 8న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని ఆర్గనైజర్ సీహెచ్.గోపి తెలిపారు. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన అండర్ – 7, 9, 11 విభాగాల్లో బాలబాలిలకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వివరాలకు 94401 62749 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఈనెల 10నుంచి
గార్లఒడ్డులో బ్రహ్మోత్సవాలు
ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో ఈనెల 10వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ వెంకటదుర్గాప్రసాద్ తెలిపారు. మొదటిరోజైన 10వ తేదీన సుప్రభాతసేవ, యాగశాల ప్రవేశం, 11న స్వామి జయంతి సందర్భంగా 108 కలశాలతో అభిషేకం, 12న శ్రీవిష్ణు సహస్రనామస్రోత్ర పారాయణం, స్వా మివారి ఎదుర్కోలు, కల్యాణం, 13న స్వామి వారి ఊరేగింపు, 14న మహా పూర్ణాహుతి తదితర పూజలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈఓ కోరారు.
కామర్స్ అధ్యాపకుడికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళా శాల కామర్స్ అధ్యాపకు డు జల్లా రాంప్రసాద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ఆయన ‘ఇంపాక్ట్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇంటర్వెన్షన్ ఆన్ సోషియో ఎకనామిక్ కండీషన్స్ ఆఫ్ బెని ఫీషియరీస్ – ఏ స్టడీ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్’ అంశంపై ఓయూ కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సంధ్యారాణి పర్యవేక్షణలో పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం సమర్పించగా డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌ను మంగళవారం కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, అధ్యాపకులు డాక్టర్ సర్వేశ్వరరావు, శాస్త్రి, బానోత్ రెడ్డి, సత్యవతి, సునంద తదితరులు అభినందించారు.

ఉద్యోగి కుటుంబానికి భద్రతా ఎక్స్‌గ్రేషియా చెక్కు

ఉద్యోగి కుటుంబానికి భద్రతా ఎక్స్‌గ్రేషియా చెక్కు