
9న మిట్టపల్లికి కేటీఆర్ రాక
తల్లాడ: తల్లాడ మండలం మిట్టపల్లిలో తల్లాడ తొలి ఎంపీపీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దివంగత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఈనెల 9న ఆవిష్కరించనుండగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. మండలంలోని మిట్టపల్లిలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉదయం 10–30 గంటలకు రాయ ల విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించాక ఇక్కడ ఏర్పాటుచేసే సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు సమీపంలోని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయనున్న ట్లు వెల్లడించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన అంజనాపురానికి చెందిన కేతినేని సందీప్‌ను ఎమ్మెల్సీ తదితరులు పరామర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్ నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, తాళ్లూరి జీవన్, దిరిశాల దాసురావు, మువ్వా మురళి, కట్టా అజయ్‌కుమార్, డి. వెంకట్‌లాల్, రుద్రాక్ష బ్రహ్మం, ఇంజం కృష్ణార్జున్‌రావు, పోతురాజు వెంకటయ్య, రాయల రఘునందన్, రేవంత్, నాయుడు శ్రీనివాసరావు, శెట్టిపల్లి లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
రాయల విగ్రహావిష్కరణ, బహిరంగ సభ