
ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వివి ధ శాఖల అధికారులతో సమావేశమై ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. డీఆ ర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
వలసదారులను పంపించేయాలని వినతి
ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశస్తులను గుర్తించి వారి దేశాలకు పంపించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల వలసదారులను వారి దేశాలకు పంపించాలన్న ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు చేయాలని కోరారు. నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, ఈ.వీ.రమేష్, డాక్టర్ శీలం పాపారావు, గెంటేల విద్యాసాగర్, నున్నా రవికుమార్, మార్తి వీరభద్రప్రసాద్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి