
డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జహంగీర్ అలీ
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డీ.జహంగీర్ అలీ ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా అసిస్టెంట్ రిజి స్ట్రార్ హిలావత్ అంజియా వ్యవహరించారు. నల్ల గొండ జిల్లాకు చెందిన ఎం.డీ. జహంగీర్ అలీ, సంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్ గౌడ్, ఖమ్మం నుంచి కె.వెంకటేశ్వర్లు అధ్యక్ష స్థానానికి నామినేషనన్లు దాఖలు చేశారు. చివరకు వెంకటేశ్వర్లు, మల్లేష్ నామినేషన్లు ఉపసంహరించుకోగా... జహంగీర్ అలీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవమైనట్లు ప్రకటిచారు. కాగా, సోమవారం ఖమ్మంలోని డ్రైవర్లసంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘంలో గతంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఇంకా ఈసమావేశంలో ఎం.డీ.సలీం, దాసరి వేణు, లింగంపల్లి గగన్న, జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.