బాలికపై లైంగికదాడికి యత్నం..! | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి యత్నం..!

May 5 2025 8:10 AM | Updated on May 5 2025 8:10 AM

బాలిక

బాలికపై లైంగికదాడికి యత్నం..!

మధిర: పట్టణంలోని స్టేషన్‌రోడ్‌లో బాలికపై సమీప బంధువు శనివారం రాత్రి లైంగికదాడికి యత్నించినట్లు సమాచారం. స్థానిక శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉంటున్న ఓ మహిళ పలు ఇళ్లలో పనిచేస్తూ కుమార్తెను చదివిస్తోంది. కుమారుడు కూలి పనులకు వెళ్తుంటాడు. కుమారుడికి కిడ్నీలో స్టోన్‌ ఉండగా చికిత్స కోసం శనివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఉండగా తన చిన్నమ్మ భర్త (బాబాయి) శనివారం రాత్రి ఇంటికి వచ్చి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా సదరు వ్యక్తి పరారయ్యాడు. ఆదివారం బాలిక తల్లి మధిర టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మధిర: దెందుకూరు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మట్టగుంజ సతీశ్‌ (23) మధిర పట్టణంలోని ఫర్నిచర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై మధిర నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై ఎదురుగా వచ్చిన టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టింది. సతీశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న ఆర్కే ఫౌండేషన్‌ అధ్యక్షులు దోర్నాల రామకృష్ణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఏన్కూరు: బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందగా.. ఆమె భర్త, కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామతండాకు చెందిన సొడియం బ్రహ్మ ఆయన భార్య సంధ్య, కూతురు అమృత కలిసి ద్విచక్రవాహనంపై ఏన్కూరు ప్రధాన సెంటర్‌కు రాగానే మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు 108 ద్వారా ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా సంధ్య (38) మృతి చెందింది. భర్త, కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి ఎస్‌ఐ రఫీ చేరకుని, కేసు నమోదు చేశారు.

భార్య మృతి.. భర్త, కుమార్తె పరిస్థితి విషమం

బాలికపై లైంగికదాడికి యత్నం..!
1
1/2

బాలికపై లైంగికదాడికి యత్నం..!

బాలికపై లైంగికదాడికి యత్నం..!
2
2/2

బాలికపై లైంగికదాడికి యత్నం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement