ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ దివ్యక్షేత్రమైన శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి(గుట్ట) కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ సోమవారం సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. స్వామి జన్మనక్షత్రం(స్వాతి) నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణ గత నెలలో మొదలుకాగా ఈసారి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామిని ఆలయం నుంచి పల్లకీపైకి చేర్చి గుట్ట కిందకు తీసుకొచ్చాక భజనలు, భజంత్రీలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ చేశారు. ఈసందర్భంగా భక్తులు నృసింహ నామ స్మరణతో మైమరిచిపోయారు. ప్రదక్షిణ పూర్తయ్యాక గుట్టపై ఆలయం పక్కనే రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వేలాదిగా హాజరైన భక్తులు
నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ