పెనుబల్లి: పంటలకు కావాల్సిన ఎరువుల ధరలు పెంచితే వ్యాపారులు లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. పెనుబల్లి సొసైటీతో పాటు కారాయిగూడెం, వీఎం బంజర్‌లోని పలు షాపుల్లో శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్, రికార్డులను పరిశీలించి అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఏఓ ఏవీఎస్ ఎస్. రాజు, ఏఈఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
వైరారూరల్: సాగర్ ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని డీఏఓ డి.పుల్లయ్య సూచించారు. వైరా మండలం అష్ణగుర్తి, రెబ్బవరం, తాటిపూడిల్లో పంటలను ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. వారబందీకి అనుగుణంగా నీరు వినియోగించుకోవాలని తెలిపారు. తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఏఓ మయాన్ మంజుఖాన్, ఎంపీడీఓ సరస్వతి, ఇరిగేషన్ ఏఈ హరికృష్ణ, ఏఈఓలు రాజేష్, వెంకటనర్సయ్య పాల్గొన్నారు.