సత్తుపల్లి/సత్తుపల్లిరూరల్: సింగరేణి సైలో బంకర్‌తో అనారోగ్యం బారిన పడుతున్నామని చేపట్టిన దీక్షలను సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ వాసులు శనివారం విరమించారు. దీక్షలు శనివారం 34వ రోజుకు చేరగా, వారికి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిపరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే, ఎంపీ రఘురాంరెడ్డి సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఫోన్‌లో చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ ఆనంద్‌బాబు, నాయకులు గాదె చెన్నారావు, ఎం.డీ.కమల్‌పాషా, మారోజు నాగేశ్వరరావు, కడారి మదీనా, వాడపల్లి నాగమణి, నాగరత్నం, అశోక్, ప్రవీణ్, ఏసమ్మ, నిర్మల, కమల, అరుణ పాల్గొన్నారు.
గాయపడిన కానిస్టేబుల్‌కు పరామర్శ..
అంతర్రాష్ట్ర దొంగను పట్టుకునే క్రమాన తీవ్రంగా గాయపడిన ఐడీ పార్టీ కానిస్టేబుల్ నరేష్‌ను కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, తుమ్మల యుగంధర్ పరామర్శించారు. వీరి వెంట సీఐ టి.కిరణ్, నాయకులు పాల్గొన్నారు.